ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
ములుగు: నల్గగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4గంటల వరకు కొనసాగింది. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 628మంది ఓటర్లకు గాను 583మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 383మంది పురుష, 200 మంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో పాటుగా ప్రైవేట్ హైస్కూల్ ఉపాధ్యాయులు అదే స్ఫూర్తితో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఏకంగా ఓటింగ్ 92.83శాతంగా నమోదు అయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాయంత్రం 4గంటలకు ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు. వైద్యశాఖ తరఫున అన్ని కేంద్రాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది పోలింగ్ బాక్స్‌లను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. చెక్ లీస్ట్ ప్రకారం వాటిని పరిశీలించిన అనంతరం నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.
మందకొడిగా మొదలై..
బుధవారం రాత్రి శివరాత్రి జాగారాల కారణంగా ఉదయం 8నుంచి 10గంటల వరకు జిల్లాలో 81మంది మాత్రమే తమతమ ఓటుహక్కు వినియోగించుకోగా ఓటింగ్ శాతం 12.90గా నమోదయ్యింది. ఇక 10నుంచి 12 గంటలకు వేగం పుంజుకొని 47.29శాతంగా నమోదయ్యింది. 12నుంచి 2గంటల వరకు 79.66శాతంగా.. ఎన్నికలు ముగిసేసరికి ఓటింగ్ శాతం 92.83గా నమోదు అయింది. హనుమకొండ, వరంగల్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు సైతం తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన
కలెక్టర్, ఎస్పీ
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టరదివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో సీసీటీవీ ఫుటేజీల ద్వారా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీ శబరీశ్ నిత్యం పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
భారీ బందోబస్తు
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. ఓటర్లు, అధికారులు పోలింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్‌లు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తొమ్మిది కేంద్రాలలో 200మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.
– మరిన్ని ఫొటోలు 9లోu
జిల్లాలో 628ఓట్లకు 583 పోలింగ్
కేంద్రాలను సందర్శించిన
కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్
92.83శాతం పోలింగ్ నమోదు
డ్రోన్‌తో నిఘా
వెంకటాపురం(కె): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీలోని మావోయిస్టు ప్రాంతాలపై పోలీసులు డ్రోన్‌తో నిఘా వేసి ఉంచారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావుల పర్యవేక్షణలో మండల పరిధిలోని గోదావరి ఫెర్రి పాయింట్లతో పాటుగా పోలింగ్ కేంద్రాన్ని డ్రోన్‌తో నిత్యం పర్యవేక్షించారు.
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment