నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నేడు(శుక్రవారం) టీజీఆర్‌టీసీ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సమస్యలు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు సెల్ నంబర్ 9959226048లో సంప్రదించాలని కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోటగుళ్లలో లింగోద్భవ
రుద్రాభిషేకం
గణపురం: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గురువారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ లింగోద్భవ రుద్రాభి షేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నపూజ కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, వినయ్, నాగరాజు, విజయ్‌కుమార్, శంకర్ నిర్వహించారు.
జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన
భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వారసంతలో మోబైల్ వ్యాన్‌తో అవగాహన కల్పించారు. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సూచించారు. క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు.
మహిళలకు క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 1న అంబేడ్కర్ స్టేడియం, థౌసండ్ క్వార్టర్స్, మార్చి 3న ఇల్లంద క్లబ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
యాజమాన్యమే
పనులు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని విరమించుకొని సింగరేణి యాజమాన్యమే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గని రెండో సీమ్‌ను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేటీకే 8వ గని ప్రైవేట్‌పరం చేయడం వల్ల సింగరేణికే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ిసింగరేణి ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రైవేట్‌పరం చేయడం వల్ల డిపెండెంట్ ఉద్యోగాలు రాక కార్మిక పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్‌ఓటు జీఎం కవీంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్‌రెడ్డి, విజేందర్, శ్రీనివాస్, ఆసిఫ్‌పాష, రవికుమార్, రామచందర్ పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం
Comments
Please login to add a commentAdd a comment