ఫాస్టాగ్‌తో అటవీశాఖకు ఆదాయం
● ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్
ఏటూరునాగారం: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఫాస్టాగ్ చెక్‌పోస్టుతో అటవీశాఖకు ఆదాయం వస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్‌రెహమాన్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఫాస్టాగ్ చెక్‌పోస్టు నుంచి వాహనాలు వెళ్తుండగా ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. మండలంలోని స్థానిక వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. ఇందుకోసం స్థానిక వాహనదారులు వారి ఫోర్‌వీల్ వాహనాల ఆర్‌సీ పేపర్స్, ఆధార్ కార్డులను అటవీశాఖ కార్యాలయంలో అందజేస్తే వారికి ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉంటుందని వివరించారు. వాహనాల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ జరగడం వల్ల అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందన్నారు. వాహనదారులు విధిగా ఫాస్టాగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీటీ, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment