33కేవీ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభం
ములుగు: వేసవిలో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడమే లక్ష్యంగా 33కేవీ విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ పులుసం నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ప్రేమ్‌నగర్ సమీపంలోని షిర్డీసాయి బాబా ఆలయం నుంచి పత్తిపల్లి సబ్‌స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన అంతర్గత విద్యుత్ లైన్ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఎన్‌ఓ అవతారమెత్తిన స్వీపర్
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఎంఎన్‌ఓ పోస్టు ఖాళీగా ఉండటంతో స్వీపర్ ఎంఎన్‌ఓ పనులు నిర్వహిస్తున్నాడు. సంవత్సరకాలంగా ఎంఎన్‌ఓ లేకపోవడంతో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబుతోనే వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి కుట్లు వేయించడం, కట్లు కట్టించడం వంటి పనులను చేపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు ఎంఎన్‌ఓను నియమించేలా చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఏటూరునాగారం: వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో బాలుర సీట్లు 20, బాలికల సీట్లు 20 సీట్లు, 6వ తరతిలో 9 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు, 8వ తరగతిలో 7 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మోడల్ స్పోర్ట్స్ కొత్తగూడలో 5వ తరగతిలో బాలురకు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 4, 5, 6, 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు అర్హులని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఏటూరునాగారం డీడీ కార్యాలయంలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని సూచించారు. ఈ సెలక్షన్స్ ఈనెల 12వ తేదీన ఉంటాయని, వివరాలకు సెల్ నంబర్ 9701810567లో సంప్రదించాలని కోరారు.
రోబోటిక్ ఎగ్జిబిషన్‌కు మోడల్ స్కూల్ విద్యార్థులు
గోవిందరావుపేట: ములుగు విద్యాశాఖ, సోహన్ రోబోటిక్ అకాడమీ వారు జిల్లా నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు రోబోటిక్స్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ ఆన్వల్ రోబోటిక్ ఎగ్జిబిషన్‌లో చల్వాయి మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు బి.తరుణ్ కుమార్, భాను ప్రకాశ్‌లు పాల్గొన్నారు. వీరు రోబోటిక్ కిట్టును ఉపయోగించి సొంత ఆలోచనలతో సింగరేణి బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రమాదాన్ని గమనించి సింగరేణి కార్మికులు బయటికి వచ్చేలా అలారం సిస్టాన్ని కనుగొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కన్నాయిగూడెం: ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సమ్మయ్యతో కలిసి ఆయన శనివారం మండల పరిధిలో పర్యటించి మిర్చి కల్లాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చి పంటకు వెంటనే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలన్నారు. అనంతరం బుట్టాయిగూడెంలో మృత్యువాత పడిన కుమ్మరి నాగేశ్వర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు.
33కేవీ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభం
33కేవీ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభం
33కేవీ విద్యుత్‌లైన్ పనులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment