ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబర్ తప్పనిసరి
ములుగు: జిల్లాలోని ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబర్ కేటాయించాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సెర్ఫ్ సీఈఓ దివ్య శనివారం కలెక్టర్లతో సదరం సర్టిఫికెట్లు, యూనిక్ డిజబిలిటీస్ ఐడీ జారీ, సోలార్ పవర్ ప్లాంట్‌లపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి, గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయ పరిధిలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు, పంచాయతీ కార్యదర్శులు, సీసీ, ఎంపీడీఓలు, ఏడీఎంలకు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై అవగాహన, శిక్షణ అందించాలన్నారు. సదరం సర్టిఫికెట్ నుంచి యూడీఐడీ జనరేట్ చేసిన తర్వాత ఎవరికై నా కార్డు అందకపోతే వెంటనే రిపోర్ట్ చేయాలన్నారు. ప్రతీ దివ్యాంగుడికి వైద్యులు అందించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ యూడీఐడీ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. వివరాలను సంపూర్ణంగా నమోదు చేసుకున్న తర్వాతనే దివ్యాంగులకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఐడీలు అందుతాయని వివరించారు. దివ్యాంగులు యూడీఐడీ కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ప్రతీ విద్యార్థి లక్ష్యంతో చదవాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్, క్వాల్కమ్‌తో కలిసి విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలోని 6 మండలాల పరిధిలో గల 20 పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న బాలబాలికలకు శనివారం కెరీర్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో పదో తరగతి కీలకమన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, ఫ్లెక్సీబుల్ ఈ మూడు విషయాలు దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగాలన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని వివరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్ ప్రతినిధులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment