సర్వం సిద్ధం
పరీక్ష కేంద్రాలు ఇవే..
● వాజేడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
● ములుగు ప్రభుత్వ కళాశాల
● ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాల
● ఏటూరునాగారంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర కళాశాల
● గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల
● మంగపేట ఎక్కెటి సరోజిని శేషారెడ్డి ప్రభుత్వ కాలేజీ
● జాకారంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాల
● బండారుపల్లిలోని మోడల్ స్కూల్
● తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల
● వెంకటాపురం(ఎం) ప్రభుత్వ జూనియర్ కళాశాల
కళాశాలలో పరీక్షలను తనిఖీ చేస్తున్న డీఐఈఓ చంద్రకళ (ఫైల్)
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేశాం. బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఆయా కళాశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక అధికారులు, స్క్వాడ్ కూడా ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారం తీసుకుంటాం. విద్యార్థులు సమయంలోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
– చంద్రకళ, జిల్లా ఇంటర్మీడియట్
ఎడ్యుకేషన్ అధికారిణి
ఏటూరునాగారం: మార్చి 5వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని 9 మండలాల్లో పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా విద్యుత్ దీపాలు, బెంచీలు, తాగునీటి వసతికి చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాలకు చేతి గడియారంతో సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్ల అనుమతించేతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి పరీక్ష రాయలేని స్థితిలో ఉంటే బోర్డు అధికారులు ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి సహాయకులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించనున్నారు.
సీసీ కెమెరాల నిఘా..
కేంద్రాల్లో సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసే కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ద్వారా బోర్డు అధికారులు పర్యవేక్షణ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష గదిలోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోస్తు ఏర్పాటు చేసి అనుమతి లేని వ్యక్తులు లోనికి రాకుండా తగు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ విద్యార్థుల వివరాలు
బాలిక బాలురు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ 832 877
ఇంటర్ సెకండ్ ఇయర్ 802 833
ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ 170 71
ఒకేషనల్ రెండో సంవత్సరం 152 56
మొదటి సంవత్సరం
మొత్తం విద్యార్థులు 1,950
ద్వితీయ సంవత్సరం
మొత్తం విద్యార్థులు 1,843
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈనెల 5 నుంచి వార్షిక పరీక్షలు
జిల్లాలో 10 కేంద్రాల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment