ఆర్చరీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆ ర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు రా జు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పవ న్ కళ్యాణ్ పాల్గొని మెడల్ అందజేశారు. అనయను కోచ్ శ్రీనివాస్, అభిషేక్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment