‘మావోయిస్టు’ రహిత జిల్లా లక్ష్యం
ఏటూరునాగారం: మావోయిస్టు రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2001 సంవత్సరంలో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌పై అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ ట్రాక్టర్లలో డైరెక్షన్ మైన్స్ అమర్చి దాడి చేశారని, ఈ ఘటనలో ఒక సాధారణ పౌరుడు, ఫారెస్ట్ అధికారి, ముగ్గురు పోలీసులు మరణించారు. పోలీస్ స్టేషన్ భద్రత చర్యల్లో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే 163 ప్రధాన రహదారి మూసివేసి వాహనాల రాకపోకలను ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ ఎదురు నుంచి ఏటూరునాగారం వైపు మళ్లించినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస పోలీస్ ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు ముఖ్య నాయకులతోపాటు జేఎండబ్ల్యూపీ డివిజనల్ కమిటీకి చెందిన ఏటూరునాగారం–మహాదేవపూర్ ఏరియా కమిటీ చెందిన దళం, ఇల్లందు– నర్సంపేట దళం పూర్తిగా లేకుండా పోయిందని తెలిపారు. జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీ కదలికలు పూర్తిగా అంతరించిపోయినందున సామాన్య ప్రజల సౌకర్యార్థం 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీసులు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు.
ఎస్పీ శబరీశ్
Comments
Please login to add a commentAdd a comment