మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: మిర్చి పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఎండీ అమ్జద్ పాషా అన్నారు. మండలంలోని కాశిందేవిపేట, దేవగిరిపట్నం గ్రామాల్లో మిర్చి కల్లాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో మిర్చి సాగు అవుతుందన్నారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి పంట సాగుకు సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు పెట్టుబడితో సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంటకు నల్లి, వేరుకుళ్లు రావడంతో పంట పూర్తిగా దిగుబడి తగ్గిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి పంటను కొనుగోలు చేసి క్వింటాకు రూ.25 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేనిపక్షంలో మిర్చి రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తోట భాస్కర్, నర్సింహరావు, శ్రీకాంత్, నరేష్, ప్రభాకర్, మహేందర్, మల్లేష్, మొండయ్య, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
ఎండీ అమ్జద్ పాషా
Comments
Please login to add a commentAdd a comment