వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత
ఏటూరునాగారం: వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏటూరునాగారం అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ, జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం విద్యార్థులకు వన్యప్రాణులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల్లో ఉండే జంతువులను రక్షించుకోవాలన్నారు. అడవులను మరింత పెంచడానికి ప్రతీ విద్యార్థి మొక్కలను నాటాలని సూచించారు. వన్యప్రాణుల కోసం అటవీశాఖ ద్వారా అడవుల్లో నీటి గుంతలు, సాసర్‌ప్లేట్లు, చెక్‌డ్యామ్‌ల ద్వారా నీటిని అందించాలని వివరించారు. వాటి రక్షణకు సీసీ కెమెరాలను అమర్చుతున్నట్లు వివరించారు. విద్యార్థులు వారి ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్‌రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment