జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని కోర్టులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. రాజీమార్గమే రాజమార్గంగా భావించి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతిమార్గంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. యాక్సిడెంట్లు, చీటింగ్ కేసులు, దొమ్మి కేసులు, వివాహం, దొంగతనాలు, కరోనా సమయంలో నమోదైన కేసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, నిందితులు ఇద్దరూ కోర్డుకు హాజరై సమన్వయంతో రాజీ పడాలని తెలిపారు. ఇతర వివరాలకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లను సంప్రదించాలని సూచించారు.
నేడు విద్యుత్
వినియోగదారుల సదస్సు
వెంకటాపురం(కె): నేడు మండలంలో నిర్వహించే విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాల చారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన మీటర్లు మార్చుట, లోవోల్టేజీ హెచ్చు తగ్గులు లోపాలు ఉన్న మీటర్లు మార్చడం వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. నేడు ఉదయం 10.30గంటల నుంచి ఒంటిగంట వరకు సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మహిళా ఉద్యోగులు,
సిబ్బందికి క్రీడా పోటీలు
ములుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బందికి ఈ నెల 5, 6వ తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కూచన శిరీష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు షటిల్, టెన్నికాయిట్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, స్కిప్పింగ్, అంత్యాక్షరి, క్యారమ్, చెస్, సింగింగ్ విభాగంతో పాటు ఇండోర్, ఔట్‌డోర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
కరాటే పోటీల్లో
విద్యార్థినుల ప్రతిభ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారంలో ఈనెల 2న నిర్వహించిన సూర్య షోటోకాన్ కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో మండలంలోని కాటాపూర్ జెడ్పీ పాఠశాల, తాడ్వాయిలోని కసూర్తిబా పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో కాటాపూర్ పాఠశాలకు చెందిన నందుప్రియ ప్రథమ బహుమతి సాధించగా రక్షిత ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం బాణాల సుధాకర్ తెలిపారు. అదే విధంగా తాడ్వాయిలోని కేజీబీవీ విద్యార్థినులు కూడా కరాటే పోటీల్లో ప్రతిభ చూపి సర్టిఫికెట్లు, మెడల్స్ సాధించినట్లు హెచ్‌ఎం కేశవరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థినులను సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో కేబీబీవీ స్పెషల్ ఆఫీసర్ పుష్పలీల, ఉపాధ్యాయులు చక్రు నాయక్, సమ్మయ్య, పాపారావు, కరాటే మాస్టర్ నాని స్వామి, జైపాల్, విజయ, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment