అడవిలో ఫైర్‌లైన్స్
● కార్చిచ్చుతో అడవి ఆహుతి కాకుండా అటవీశాఖ చర్యలు
● ఫారెస్ట్‌లో నిప్పుపెట్టొదని
అధికారుల సూచన
ఏటూరునాగారం: ఏజెన్సీలోని దట్టమైన అడవిలో వేసవి వచ్చిందంటే కార్చిచ్చు ఏర్పడి వందలాది ఎకరాల్లోని చెట్లు కాలిపోతున్నాయి. అదే విధంగా అడవిలో ఎండిన ఆకులకు బాటసారులు, పశువుల కాపరులు, పర్యాటకులు వేసే నిప్పుతో ముప్పు వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని పలువురు కూలీలతో అటవీశాఖ అధికారులు సోమవారం ఫైర్‌లైన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడవికి ముప్పు వాటిల్లకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
ఫైర్‌లైన్స్ విధానం
మార్చి నెలలో చెట్లకు ఆకులు రాలిపోయి ఉగాదితో కొత్త చిగురు వస్తుంది. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులను వందల మీటర్ల పొడువునా ఫైర్‌లైన్ ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు నిప్పు పెడుతున్నారు. దీనివల్ల ఒకే లైన్ మాదిరిగా మంట అంటుకుని ఎండిన ఆకులను సైతం బూదిద చేస్తుంది. ఈ క్రమంలో ఇతర ఆకులకు నిప్పు అంటుకున్నప్పటికీ అడవిలోకి మంటలు వెళ్లనివ్వకుండా ఫైర్‌లైన్స్ నియంత్రిస్తాయి.
అడవిలోకి మంటలు వ్యాప్తి చెందకుండా..
పర్యాటకులు, బాటసారులు వేసిన నిప్పు రవ్వలతో ఆకులు అంటుకున్నప్పటికీ మంటలు భారీగా అడవిలోకి వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏటూరునాగారం సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సిబ్బందితో పాటు పలువురు కూలీలతో సోమవారం ఫైర్‌లైన్స్ కార్యక్రమం చేపట్టారు. అడవిలో ఎండిన ఆకులకు సైతం నిప్పుపెట్టి బూడిద చేశారు. ఏజెన్సీలోని అడవుల్లో ఉన్న ఎండిన ఆకులను ప్రతిరోజూ ఫైర్‌లైన్స్ ద్వారా నిప్పు పెట్టి నియంత్రిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అడవుల్లో ఎవరూ నిప్పుపెట్టొదని అటవీశాఖ అధికారి అబ్దుల్ రెహమాన్ కోరారు.
అడవిలో ఫైర్‌లైన్స్
Comments
Please login to add a commentAdd a comment