యాసంగి పంటల సంరక్షణకు చర్యలు
ములుగు: యాసంగి పంటల సంరక్షణకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. రిజర్వాయర్ నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు నడుచుకోవాలన్నారు. రోజు వారీగా చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న నీటి పరిమాణాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.
వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శాంతికుమారి
Comments
Please login to add a commentAdd a comment