● ఏటీడీఓ దే శీరాం
ములుగు రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటీడీఓ దేశీరాం అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆ ధ్వర్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ బోధనకు 160 మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పది ఫలితాల్లో విద్యార్థులు నిపుణుల సలహాలతో మెరుగైన ఫలితాలు సా ధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీ ఎంఓ రవీందర్, వాగ్యనాయక్, సుగుణ, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
అన్నారం అడవిలోకి పులి
కాటారం: మండలంలోని ప్రతాపగిరి అటవీ ప్రాంతం నుంచి అన్నారం అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు తెలుస్తొంది. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి అటవీ నుంచి ప్రతాపగిరి సమీపంలోకి పులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు పాదముద్రలు గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం పులి ప్రతాపగిరి అటవీ నుంచి మర్రివాగు మీదుగా నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పులి పాదముద్రల ద్వారా నిర్ధారణకు వచ్చారు. నస్తూర్‌పల్లి అడవి నుంచి వీరాపూర్ మీదుగా అన్నారం గుట్ట ప్రాంతంలోకి పులి చేరినట్లు అధికారులు ఆనవాళ్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment