ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
గోవిందరావుపేట: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ వర్కర్ తప్పెట్ల కిషన్, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధి లోని చల్వాయి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం 44 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్‌ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్‌ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని వివరించారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రుల్లోనే ప్రసవం అయ్యేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment