టోర్నీ విజేతలకు అభినందనలు
ములుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ విజేతగా నిలిచిన ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం ట్రోఫీ అందించి అభినందనలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు అందరూ అంకితభావంతో వాలీబాల్ ఆడి విజయం సాధించారని తెలిపారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సోమన్న మాట్లాడుతూ విద్యార్థులు అందరూ సమన్వయంతో ఆడి ట్రోఫీతో పాటు రూ.20వేల నగదు బహుమతిని గెలవడం సంతోషంగా ఉందన్నారు. టీం సభ్యులు అయిన వసంతరావు, ఉదయ్‌కుమార్, బద్రి, సాగర్, మహేష్, శివ, నరసింహా, తిరుపతి, బన్నీ, శశి, నర్సింగరావు, శ్రీకాంత్‌లను అధ్యాపక బృందం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కవిత, భాస్కర్, నాగమణి, సరిత, శిరీష, రాధిక, అనిల్‌కుమార్, ఉదయశ్రీ, విజేత, శంకర్, తేజోలత, శ్రీను, మహ్మద్ మౌలానా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment