రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ములుగు: రంజాన్ మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సమప్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రంజాన్, హోలీ పండుగల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. రంజాన్ పండుగ రోజు ములుగు ఈద్గాలో సుమారుగా 5 వేల మంది ప్రార్థనలకు హాజరవుతారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు రహమతుల్లా బేగ్, హజీ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్, సయ్యద్ షకిల్, రియాజ్ మీర్జా బేగ్, కుత్బోద్దీన్, అబ్దుల్‌రబ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment