ట్రాఫిక్ జాంలో 108 అంబులెన్స్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కొండాపురం గ్రామ సమీపంలో మంగళవారం 108 అంబులెన్స్ వాహనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. ఎదిర వైద్యశాల నుంచి అత్యవసరంగా ఓ పేషెంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరి యా ఆస్పత్రికి తరలించేందుకు వెళ్లి వెంకటాపురం వస్తున్న క్రమంలో కొండాపురం గ్రామసమీపంలో ఇసుక లారీల మధ్యలో సుమారు అరగంటపాటు అంబులెన్స్ ఇరుక్కుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఇసుక లారీలు పెద్ద సంఖ్యలో వెంకటాపురం మండలం మీదుగా వెళ్తుండడంతో ఇసుక లారీల మధ్యలో 108 వాహ నం ఇరుక్కుపోయింది. అంబులెన్స్‌లో పేషెంట్ ఉన్నప్పుడు ఇలా ట్రాఫిక్ జాంలో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment