లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ?
భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్దతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి దివంగత అజ్మీరా చందూలాల్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment