పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి పనులు
పరీక్ష కేంద్రం వద్ద చెత్తాచెదారం, చిందరవందరగా ఉన్న నాపరాళ్లు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పరీక్షల ప్రారంభానికి ఒకరోజు ముందు మంగళవారం కాంట్రాక్టర్లు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్ మొదటి, ద్వితీయ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు కావా ల్సిన విద్యుత్, ఫ్యాన్లు, కిటికీలు, తాగునీటి వసతులకు సంబంధించిన పనులను పరీక్షలకు ఒకరోజు మిగిలి ఉండగా కాంట్రాక్టర్లు మొదలు పెట్టారు. దీంతో కళాశాల ఆవరణలో నాపరాళ్లు చిందరవందరగా పడిఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
అధ్వానంగా నాపరాళ్లు, చెత్తా చెదారం
పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి పనులు
Comments
Please login to add a commentAdd a comment