ప్రశాద్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ప్రశాద్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రాజెక్టు పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మే నెలలో హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరుగనున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన మహిళలు పర్యాటక స్థలాల ను పర్యటించే అవకాశం ఉందన్నారు. రామప్పకు వచ్చే విదేశీ పర్యాటకులకు అన్ని వసతులు కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాద్ స్కీం పనులు ఏప్రిల్ 20లోపు పూర్తి చేసి, రామప్ప పరిసర ప్రాంతాలను సుందరీకరించాలని తెలిపారు. కాకతీయ కట్టడాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా విదేశీ పర్యాటకులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో తొలి సారిగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన సుందరీమణులను పర్యాటక ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకునేలా రామప్పలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ ఒంటేరు దేవరాజ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, ఇంజనీరింగ్ అధికారులు ధనరాజ్, విజయ్‌కుమార్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, ఎంపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీఎస్
ప్రశాద్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment