గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏళ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment