2024 14,332
2021నుంచి 2025 ఫిబ్రవరి వరకు పశువులకు అందిన వైద్యం
2,011
నకిలీ పురుగు మందులు..
నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా ను బుధవారం అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
డిగ్రీ ఫలితాల నిలిపివేత
కేయూ అకాడమిక్ డీన్‌కు ఫీజు చెల్లించకపోవడంతో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలను అధికారులు నిలిపివేశారు.
– 8లోu
ములుగు రూరల్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తోంది. పశుపోషకులు జీవాలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా రైతులు 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించి వైద్యసేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. రైతులు ఫోన్‌లో అందించిన సమాచారం మేరకు రైతులు కోరిన ప్రాంతానికి వెళ్లి పశువులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. సంచార వాహనాల్లో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు వైద్యానికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలు అందిస్తున్నారు. దీంతో ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పశుమరణాలు తగ్గుముఖం పట్టాయి.
జిల్లాలో పశువైద్య కేంద్రాల
వివరాలు
జిల్లాలోని తొమ్మిది మండలాల్లో పశువైద్య కేంద్రాలు 15 ఉన్నాయి. అదే విధంగా పశువైద్య ఉప కేంద్రాలు 16, ఏరియా ఆస్పత్రులు ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె)లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు.
2021
6,846
వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు లేవు..
జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లోని పశువులకు సంచార వైద్యం అండదం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ములుగు జిల్లాలో కలిశాయి. అప్పటి నుంచి ఈ రెండు మండలాలకు 1962 సేవలు అందడం లేదు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు సైతం సంచార వైద్య సేవలు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు.
2025
ఫిబ్రవరి
వరకు
పశుపోషకులకు ఉపయోగం..
ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సంచార వైద్యం సత్ఫలితాలు ఇస్తుంది. మండల కేంద్రాల్లో పశువైద్య కేంద్రాలు, గ్రామాలలో పశువైద్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ సంచార వైద్యం పశుపోషకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఆస్పత్రి పనివేళలతో సంబంధం లేకుండా మూగజీవాలకు సంచార వైద్య సేవలు అందుతున్నాయి.
2022
7,044
2023
7,012
Comments
Please login to add a commentAdd a comment