సైబర్ నేరాలపై అప్రమత్తం
ములుగు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని జంగాపల్లిలో సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్, జాబ్ ప్రాడ్, సైబర్ స్టాకింగ్, సైబర్ స్లేవరి, మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రాడ్ వంటి నేరాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సైబర్‌క్రైం. జీఓవీ. ఇన్ పోర్టల్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ యాసిన్, జంగాలపల్లి సీసీ భీమా, ములుగు సీసీ చంద్రమౌళి, సిబ్బంది శ్రీకాంత్, ఉమామహేశ్వర్, తేజస్వీ, శ్వేతపాల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ సందీప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment