టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి
ఏటూరునాగారం: పరీక్షలు రాసే టెన్త్ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఏకాగ్రతతో చదివి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు డాక్టర్ బరుపాటి గోపి, అంబటి శ్రీధర్‌రాజు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పీఆర్‌ఆర్ యూనిటీ, చారిటీ ట్రస్టు ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు మోటీవేషన్ క్లాస్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నట్లు తెలిపారు. పరీక్షలను ఏ విధంగా రాయాలి, ప్రశ్నా పత్రం అర్ధం చేసుకునే విధానం వంటి తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ట్రస్టు ఇన్‌చార్జ్ మడుగూరి నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెడ్మాస్టర్ సాంబశివరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎడ్యుకేషనల్ కౌన్సిలర్లు గోపి, శ్రీధర్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment