రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించి అటెండెన్స్, రోగుల ఓపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వేసవి ఎండల తీవ్రతతో ఎండ దెబ్బకు గురై ఆస్పత్రి వచ్చిన వారికి సకాలంలో వైద్య సేవలందించాలని ఆదేశించారు. గ్రామాలను సందర్శించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విటమిన్ లోపం ఉన్న వారిని గుర్తించేందుకు ఫీల్డ్ సర్వే నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు చిరంజీవి, మౌనిక ఉన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment