హామీలు నెరవేర్చాలని సీఎంకు పోస్టు కార్డులు
ములుగు: ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మల్లంపల్లి మండల ఉద్యకారులు గురువారం సీఎంకు పోస్టు కార్డులు పంపారు. 220 చదరపు గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 10లక్షలు, రూ.2,500ల పెన్షన్ అందించాలని పోస్టు కార్డులో విన్నవించి రాశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచారి, మాచర్ల ప్రభాకర్, రాజేశ్వర్‌రావు, హరినాధ్, బోయిని రవి, రేణుకుంట్ల సురేష్, చిదరం సంతోష్, లిండాద్రి, మనోహరస్వామి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment