1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ
సంవత్సరం పరీక్షలు
ములుగు: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10పరీక్ష కేంద్రాల్లో 1,853 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,806 మంది హాజరయ్యారు. 47మంది గైర్హాజరు అయ్యారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున భారీ బందోబస్తు నిర్వహించారు. జనరల్ విభాగంలో 1,645 మంది గాను 1,604 మంది, ఒకేషనల్ విభాగంలో 208 మందికి 202 మంది హాజరయినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు.
1,370 ఎకరాల్లో సర్వే పూర్తి
ములుగు: మొక్కజొన్న పంటను సాగు చేసి ఆర్థికంగా నష్టపోయిన వెంకటాపురం(కె) మండలానికి చెందిన 616 మంది రైతులకు సంబంధించిన 1,370 ఎకరాల్లో సాగు చేసిన పంటను సర్వే చేసినట్లు ఏడీఏ సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల జాబితాను గ్రామ పంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో వారం రోజుల పాటు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే సంబంధిత గ్రామాల ఏఈఓల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని వివరించారు.
పశు వైద్యశిబిరం
వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం, చీకుపల్లి గ్రామాల్లో గురువారం వెంకటాపురం(కె) సహాయ సంచాలకులు డాక్టర్ వేణు పర్యవేక్షణలో పశు వైద్యశిబిరం నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పశువులను వైద్యులు శ్రీనిధి, హరీశ్‌రెడ్డి పరీక్షించి మందులను అందించారు. దూడలకు నట్టల నివారణ మందులను తాగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు మాట్లాడుతూ వేసవి కాలంలో పశువుల పట్ల తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ శిబిరంలో జిల్లా గోపాలమిత్ర సూపర్ వైజర్ లక్ష్మణ్, కుమారస్వామి, ఖాజాఖాన్. కృష్ణ, రాంబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ ఫైలింగ్‌పై
అవగాహన అవసరం
భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్‌లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులను వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్‌లు అఖిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు.
1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
1,806మంది హాజరు.. 47మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment