డబుల్ ట్రబుల్
ఏటూరునాగారం: నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని ఆశపడిన పేదలకు నిరాశే మిగులుతోంది. నిల్వ నీడ లేక గుడిసెల్లోనే పేదల జీవితాలు మగ్గుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కలలు సాకారం అవుతాయన్న వారి కళ్లలో మిగిలిపోయిన కట్టడాలే కానొస్తున్నాయి.
జిల్లాలోని 9మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 2016లో కేసీఆర్ ప్రభుత్వం 1238 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇల్లుకు రూ.5.30లక్షల చొప్పున నిధులు సమకూర్చి కాంట్రాక్టర్లకు నిర్మాణాల బాధ్యతలు అప్పగించింది. కానీ సకాలంలో కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేదు. దీంతో అధికారులు బిల్లులు ఇవ్వకపోవడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు 60 శాతం మాత్రమే పూర్తి చేశారు.
40శాతం పనులు వివిధ దశల్లో..
మిగతా 40శాతం ఇళ్లు గోడలు పూర్తికాకుండా, అసంపూర్తిగా పిల్లర్లు, మెట్లు కూలిపోయి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయని పాత ఇళ్లను తొలగించి నిరుపేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే మిగిలిపోయాయి. మంగపేట మండలం బోరునర్సాపురంలో 20 ఇళ్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 20 ఇళ్లను కేవలం పునాదులు వేసి వదిలేశారు. దాంతో ఇంటి వద్ద బర్కాలు కట్టుకొని లబ్ధిదారులు కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.
అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం
గుడిసెల్లోనే జీవిస్తున్న పేదలు
ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment