భూపాలపల్లి అర్బన్: ఇన్‌స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్‌స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రవాణాలో జాగ్రత్తలు
పాటించాలి
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్‌గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment