చట్టాలపై అవగాహన తప్పనిసరి
ములుగు: మహిళా చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహర్షి డిగ్రీ కళాశాల ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు నేటికీ వివక్షత ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత న్యాయ సలహా ఎలా పొందాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్‌కుమార్, ఏజీపీ బాలుగు చంద్రయ్య, మహర్షి విద్యాసంస్థల చైర్మన్ తుమ్మ పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment