బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత

Published Sat, Mar 8 2025 1:48 AM | Last Updated on Sat, Mar 8 2025 1:45 AM

బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత

బాల్యవివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యత

ఏటూరునాగారం: బాల్య వివాహాల నియంత్రణ ప్రతీఒక్కరి బాధ్యతని జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌ అన్నారు. మండల కేంద్రంలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006చట్టం ప్రకారం 18ఏళ్లు నిండని అమ్మాయిలు, 21ఏళ్లు నిండని అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098 లేదా 112కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధికారి హరికృష్ణ, సిబ్బంది రాజు, సుదర్శన్‌, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement