మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
మంగపేట: మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో గురువారం రాత్రి వాల్‌పోస్టర్లు వెలిశాయి. కోమటిపల్లి క్రాస్ రోడ్డు, పలు ప్రధాన కూడళ్లతో పాటు కమలాపురంలోని పలు ప్రాంతాల్లో సైతం పోస్టర్లు వెలిశాయి. శాంతియుత జీవనం మనహక్కు, అనుమానితుల సమాచారమిద్దాం.. పోలీసులకు సహకరిద్దాం.. అని తదితర నినా దాలు వాల్ పోస్టర్లలో ఉన్నాయి. మరి కొన్ని పోస్టర్లలో మా వోయిస్టులు, ఆది వాసీ గిరిజనుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. వాల్ పోస్టర్లు గురువారం రాత్రే వెలిశాయని,ఎవరు అంటించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment