వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ మొక్కల ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వు జోన్‌గా ప్రకటించాలని నర్సాపూర్‌కు చెందిన ఎండి.అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 51 ఎకరాల కేన్ ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో అన్యాక్రాంతం అవుతుందన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రాంతంగా పిలవబడే కేన్ ప్రాంతం చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని ‘కేనోపి వాక్’ పేరుతో టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసి భావితరాలకు అందించాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment