హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు వివిధ సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలలో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించి ఆలయ పురాణం స్వామివారి విశిష్టతను వివరించారు. సంతాన ప్రాప్తి కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.
Comments
Please login to add a commentAdd a comment