చట్టం చేసే వరకు ఉద్యమాలు ఆగవు
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ను చట్టం చేసేంత వరకు ఉద్యమాలు ఆగవని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బోదెబోయిన స్వాతి అన్నారు. మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో యువతకు సమావేశాలు ఏర్పాటు చేసి వారిని చైతన్యం చేసి సమస్యల పరిష్కారానికి ఉద్యమించేలా తయారుచేయాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, ఇర్ప బాలాజీ, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, మంగపేట మండల అధ్యక్షులు కుర్శం శివశంకర్, సున్నం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర
మహిళా జాయింట్ సెక్రటరీ స్వాతి
Comments
Please login to add a commentAdd a comment