న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తాం
వెంకటాపురం(కె): ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్చంధ సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో న్యాయ కళాశాల ఏర్పాటుపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో న్యాయ కళాశాల ఏర్పాటు న్యాయమైన డిమాండ్‌గా ఉందన్నారు. న్యాయ కళాశాల సాధించుకునే వరకు ఉద్యమించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తుందన్నారు. దేశంలో అత్యధికంగా అన్యాయానికి గురైంందని ఆదిమ తెగలేనని వివరించారు. ఈకార్యకమంలో నాయకులు పాయం సత్యానారాయణ, కొర్స నర్సింహామూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
గోండ్వానా సంక్షేమ పరిషత్
రాష్ట్ర కార్యదర్శి సాయి
Comments
Please login to add a commentAdd a comment