సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
ఏజెన్సీ గ్రామాల్లో
తీవ్రమైన నీటిఎద్దడి
● ప్రతీ ఎండాకాలంలో తప్పనితిప్పలు
● గోదావరి, వాగునీరే
గిరిజనులకు ఆధారం
● పట్టించుకోని అధికారులు, పాలకులు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పకల మహేశ్. ఏటూరునాగారం మండలం వీరాపురం. కూలి పనులు, వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగునీటి కోసం ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంపన్నవాగుకు కాలినడకన వెళ్తున్నాడు. వాగులో చెలిమల నుంచి నీటిని తోడుకుని కావడితో నీటి బిందెలను మోసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కావడితో నీటిని తెస్తేగాని ఇంట్లో వారి దాహం తీరదు.
ఏటూరునాగారం: ఏజెన్సీలో వంద కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నా వేసవికి ముందే నీటి ఎద్దడి మాత్రం తప్పడం లేదు. ప్రజలు, రైతులు నానాటికీ భగీరథ ప్రయత్నాలను ప్రతీ వేసవికాలంలో చేయడం ఆనవాయితీగా వస్తోంది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడంతో వాగులపైనే గిరిజనులు ఆధారపడుతున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు, ఏజెన్సీవాసుల తాగు, సాగునీటి కష్టాలు తీరడం లేదు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment