విన్నవించాం.. పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో ప్రజల వినతులు
● స్వీకరించిన అధికారులు
● కలెక్టర్, పీఓ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన ప్రజలు
గిరిజన దర్బార్‌లో..
మంగపేట మండలానికి చెందిన తొలెం నర్సయ్య 25 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు పెసా గ్రామ సభల ద్వారా వీడీసీలు స్థానిక ఆదివాసీలకు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్ రైస్ మిల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం శివాపురం ప్రాంతానికి చెందిన కృష్ణవేణి నిరుద్యోగిగా ఉన్నానని కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. వెంకటాపురం మండలం బోదాపురం ప్రాంతానికి చెందిన ఇరుప అనిత మినీ అంగన్‌వాడీ సెంటర్‌లో టీచర్‌గా ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన తోలెం హైమ కంటింజెంట్ వర్కర్‌గా విధులు నిర్వర్తించడానికి అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అడవి పందుల నుంచి చేతికి వచ్చిన పంటలను రక్షించాలని కోరుతూ ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, పొట్లాపూర్, బండారుపల్లి, పత్తిపల్లి, మదనపల్లి, జగ్గన్నపేట, పంచోత్కులపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు కర్షక సంక్షేమ సలహా సంఘం ఆధ్వర్యంలో తమగోడును కలెక్టరేట్‌కు వచ్చారు. గుంపులు గుంపులుగా వస్తున్న అడవిపందులు మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి బ్యాంకు ద్వారా సబ్సిడీ కింద సోలార్ ఫెన్సింగ్ రుణం అందించాలని కోరారు. లేని పక్షంలో అడవి పందులు గ్రామాల్లోకి రాకుండా అటవీశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
అడవి పందుల నుంచి
పంటలను రక్షించాలి
విన్నవించాం.. పరిష్కరించండి
విన్నవించాం.. పరిష్కరించండి
Comments
Please login to add a commentAdd a comment