కరాటేలో విశాల్‌సాయి ప్రతిభ
ఏటూరునాగారం: రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విశాల్‌స్థాయి ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ ఎండీ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా విశాల్‌సాయితో పాటు కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారని తెలిపారు. ఈ పోటీలకు ఏటూరునాగారం కరాటే అకాడమికి చెందిన క్రీడాకారులు హాజరై ప్రతిభ కనబర్చారని వివరించారు. సబ్ జూనియర్ విభాగంలో వసంత విశాల్‌సాయి 40 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా ఊరుగొండ అఖిలేష్, భూక్య అభిమార్ 25 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. బంగారు పతకం సాధించిన విశాల్‌సాయి జూన్ 14వ తేదీన ఉత్తరాఖండలోని డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు హుస్సేన్ తెలిపారు. అలాగే అలువాల విఘ్నశ్రీ, అభిరామ్ బ్రాస్ పతకాన్ని సాధించారు. ఈ కార్యక్రమంలో మణిదీపిక, స్వాతిక, గణేశ్‌లతో పాటు కరాటే మాస్టర్ అబ్బు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment