పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం
ములుగు: పశువుల అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం చెందారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రచారి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో బలరాం మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా అశాంతి కనిపిస్తుందని తెలిపారు. గంజాయి అమ్మకాలు, సేవించడం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. పట్టణం నుంచి పల్లెలకు గంజాయి సరఫరా మొదలయ్యిందని వివరించారు. యువత మత్తులో మునిగి తేలుతుందన్నారు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు సోదాలు చేయడం తప్పా సంకల్పంతో పనిచేసే అధికారులే లేరని వాపోయారు. మంత్రి సీతక్క గ్రామాల్లో పర్యటించడం తప్పా జరుగుతున్న తతంగాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులతో తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేసి గంజాయి. పశువుల అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు, రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
Comments
Please login to add a commentAdd a comment