ప్రణీత్ ప్రతిభ..
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్‌లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment