
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
టేకుమట్ల: ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పా టు చేయడం అభినందనీయమని ఎస్సై దాసరి సు ధాకర్ అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లిలో ర మేశ్ వైండింగ్‌వర్క్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా దాసారపు రమేశ్ చలివేద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై దాసరి సుధాకర్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చలివేద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లబెల్లి రవీందర్, మాజీ ఎంపీటీసీ లచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎస్సై దాసరి సుధాకర్