
పెళ్లి నిర్ణయం పెద్దలకే..
ప్రేమ, వివాహం విషయంలో యువత ఆలోచన తీరు మారుతోంది. ప్రేమ, ఆకర్షణ, మ్యారేజ్ కన్నా జీవితంలో స్థిరపడేందుకే అధిక శాతం యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, పీజీ కళాశాలల విద్యార్థులతో ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 120 మంది యువతులు, 120 మంది యువకులు చొప్పున మొత్తం 240 మందితో సర్వే నిర్వహించాం. యువతీ, యువకుల్లో భవిష్యత్‌పై స్పష్టమైన లక్ష్యాలు ఉండడం.. చదువు తర్వాత ఉద్యోగ సాధన.. ఆపై ఆర్థిక స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలనే ధోరణి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో పెద్దల మాటకే విలువ ఇస్తామని ఎక్కువ మంది చెబుతున్నారు. ఇందులో యువతులే కాక యువకులూ ఉండడం విశేషం. ఒకవేళ మనసులు కలిసి జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా పెద్దల అంగీకారం తప్పనిసరి తీసుకుంటామని అంటున్నారు. అయితే, ప్రేమ పెళ్లి విషయంలో యువతులతో పోలిస్తే యువకుల్లో కొంత ఎక్కువగా ఆసక్తి కనిపించింది. సర్వేలో భాగంగా యువతీ యువకులను వివిధ ప్రశ్నలు అడుగగా వారి సమాధానాలు ఇలా ఉన్నాయి...
– ‘సాక్షి’ నెట్‌వర్క్
● పెళ్లి విషయంలో మారుతున్న యువత వైఖరి
● కెరీర్, ఉన్నత స్థాయి ప్రమాణాలకు ప్రాధాన్యం
● తల్లిదండ్రుల నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి
● ప్రేమిస్తే పేరెంట్స్‌ను ఒప్పించాలంటున్న యువత
ప్రేమ వివాహాలు భవిష్యత్‌తరాలపై ప్రభావం చూపుతాయా?
ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏది సరైనది?
56
పెద్దలు కుదిర్చిన పెళ్లి
ప్రేమ వివాహం
లవ్ అండ్ అరేంజ్
91
23
11
41
ప్రేమికుల దినోత్సవంసందర్భంగా యువత మనోగతం
ప్రస్తుతం ప్రేమలో సోషల్ మీడియా ప్రభావం ఉందా?
కెరీర్ ముఖ్యమా.. పెళ్లి ముందా?
వయసు రాగానే పెళ్లి
ఏ మాత్రం లేదు
ఎక్కువగా ఉంది
కెరీర్ ఫస్ట్
13
227
222

పెళ్లి నిర్ణయం పెద్దలకే..

పెళ్లి నిర్ణయం పెద్దలకే..
Comments
Please login to add a commentAdd a comment