మేలైన పశుసంపదను పెంపొందిద్దాం
అచ్చంపేట రూరల్: మేలైన పశు సంపదను పెంపొందించేందుకు పాడి రైతులు కృషిచేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐనోల్ ప్రాథమిక పశువైద్య కేంద్రంలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన మేలుజాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 43 ముర్రా, 9 ఒంగోలు జాతి దూడలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద పుట్టిన దూడలను శాసీ్త్రయ పద్ధతిలో పోషించినట్లయితే ఆరోగ్యంగా పెరిగి మంచి పాడి పశువులుగా వృద్ధిచెందుతాయన్నారు. దూడలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలను శుభ్రం చేయాలని.. బొడ్డు కత్తిరించి టించర్ అయోడిన్ అద్దాలని సూచించారు. పుట్టిన గంటలోపు ముర్రుపాలు తగినంతగా తాగించాలని తెలిపారు. 10వ రోజున నట్టల నివారణ మందు తాగించాలని, తదుపరి ప్రతి 21 రోజులకోసారి 3 నెలల వరకు తాగించాలని సూచించారు. దూడలకు 4 నెలల వయసులో గాలికుంటు, గొంతు వాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. అనంతరం 60 దూడలకు నట్టల నివా రణ మందులు తాగించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయం కోసంప్రజాభవన్ ముట్టడిస్తాం
చారకొండ: మండల కేంద్రంలో ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 20 ఇళ్లను నేలమట్టం చేయడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. వారికి న్యాయం చేయాలని మండలస్థాయి నుంచి జిల్లా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లేదా రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింత ఆంజనేయులు, మండల కార్యదర్శి బాలస్వామి, సీపీఐ తాలూకా ఇన్‌చార్జి చిల్వేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తాడూరు: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజే ష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని యాదిరెడ్డిపల్లి నుంచి గుంతకోడూరుకు రూ. 2.90కోట్లతో, ఐతోలు నుంచి కొమ్ముకుంటతండా వరకు రూ. 2.60 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీటీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. బీటీరోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. రాష్ట్రాభివృద్ధి, పేదల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మండలంలో రైతులకు రూ. 50 కోట్లకు పైగా రుణామాఫీ చేసినట్లు వివరించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఐతోలు సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సింగిల్‌విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి, డీటీ గోవిందు, ఏఈ శివకృష్ణ పాల్గొన్నారు.
మేలైన పశుసంపదను పెంపొందిద్దాం
మేలైన పశుసంపదను పెంపొందిద్దాం
Comments
Please login to add a commentAdd a comment