అన్ని వసతులతో పునరావాసం
నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని వటువర్లపల్లి గ్రామ తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఒత్తిడి లేకుండా గ్రామ సభలో సుముఖత వ్యక్తంచేసిన 671 కుటుంబాలకు నిర్ణీత గడువులోగా అన్ని వసతులతో పునరావాసం కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అమ్రాబాద్ టైగర్ రిజర్వు కోర్ ఏరియా నుంచి వటువర్లపల్లి గ్రామం తరలింపుపై జిల్లాస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు ప్రతిపాదించిన వట్టువర్లపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా గ్రామసభ, జిల్లాస్థాయి కమిటీ సమావేశాల్లో సమ్మతి తెలియజేశారని వివరించారు. వటువర్లపల్లిలో మొత్తం 671 కుటుంబాలను గుర్తించగా.. అందులో 311 కుటుంబాలు రూ. 15లక్షల చొప్పున పరిహారం తీసుకుంటామని గ్రామసభలో వెల్లడించారని.. మిగిలిన 360 కుటుంబాలకు బాకారం సమీపంలో 220 గజాల చొప్పున ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు జీవనోపాధి కోసం 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు. పునరావాసం కోసం కేటాయించిన ప్రాంతంలో సీసీరోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుంటూ పునరావాసం పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.
● నల్లమల అటవీ ప్రాంతంలో జన సంచారం తగ్గించేందుకు అక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింత అభివృది ్ధ చేయాలన్నారు. వటువర్లపల్లి గ్రామంలోని రెవెన్యూ భూమి, ఆస్తుల వివరాలను లెక్కించాలన్నారు. వటువర్లపల్లి నుంచి పునరావాసం కోసం 773 దరఖాస్తులు రాగా.. వివిధ కారణాలతో 102 కుటుంబాలను అనర్హులుగా గుర్తించినట్లు వివరించారు. అంతకుముందు వటువర్లపల్లి గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం ఉన్నారు.
వటువర్లపల్లి గ్రామస్తులకుఇబ్బందులు లేకుండా చర్యలు
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment