అమర జవాన్ల త్యాగాలు మరువలేనివి
కొల్లాపూర్: పుల్వామా దాడి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ శుక్రవారం రాత్రి కొల్లాపూర్‌లో రిటైర్డ్ జవాన్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అమర జవాన్ల చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను దేశం మర్చిపోదన్నారు. వారి పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం గౌరవాధ్యక్షుడు రంగినేని ప్రసాద్ నాయుడు, అధ్యక్షుడు బాలస్వామి, ప్రధాన కార్యదర్శి నజీర్‌బాబా, సీఆర్‌పీఎఫ్ రమేష్, బీఎస్‌ఎఫ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment