జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పీఎంశ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. పీఎంశ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలలకు మొదటి విడతగా విడుదలైన నిధులపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రానా హైదరాబాద్ నుంచి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఎంపికై న 27 పాఠశాలలకు రూ. 3.89 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌లు, ల్యాబ్‌లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, మంచినీటి వసతి తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పీఎంశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెండో విడత నిధులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ రమేష్‌కుమార్, సమగ్రశిక్ష అభియాన్ గణాంక అధికారి మధుసూదన్ రెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ నూరుద్దీన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment