ఉపాధి ప్రణాళిక ఖరారు
గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు పూర్తి
మొత్తం జాబ్ కార్డులు
1,94,725
యాక్టివ్‌గా ఉన్నవి 1,10,095
పనిచేస్తున్న
కూలీలు 1,81,605
ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 38.30 లక్షలు
నాగర్‌కర్నూల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎన్ని పనిదినాలు కల్పించాలి.. వారికి కేటాయించాల్సిన బడ్జెట్ ఎంత.. ఏయే పనులు చేయించాలనే అంశాలపై ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలో వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేకపోవడం, కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా అధికారులు ఈ ప్రణాళిక తయారు చేశారు. వ్యవసాయం, మత్స్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టే పనులను గుర్తించారు.
జిల్లాలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూలీలకు 38.30 లక్షల పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం దాదాపు రూ.114 కోట్ల నిధులు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కాగా గత 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 38.42 లక్షల పనిదినాలను నిర్దేశించగా.. ఇప్పటి వరకు 32.53 లక్షల పనిదినాలు పూర్తిచేశారు. దీని కోసం ఇప్పటి వరకు కూలీలకు రూ.105.53 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 43 రోజులు ఇంకా మిగిలి ఉండగా మిగతా పనిదినాలను సైతం పూర్తి చేసి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. ఈ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన, పల్లెబాటలు, నీటి పరిరక్షణ, నీటి నిల్వ, అడవుల పెంపకం, మొక్కలు నాటడం, బోర్‌వెల్ రీచార్జ్, బీడు భూములను సాగులోకి తెచ్చే పనులు చేపట్టనున్నారు. కాగా.. గతేడాది కంటే ఈసారి 12 వేల మేర పనిదినాలు తగ్గడం గమనార్హం.
గతేడాది కంటే తగ్గుదల
కూలీల
సంఖ్య
పెరగవచ్చు
పెరగనున్న డిమాండ్..
ఉపాధి కూలీకి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే భూమిలేని కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తిస్తుంది. దీంతో జాబ్‌కార్డు తీసుకోకుండా ఉన్న నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు హాజరయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా పనులను కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
2025– 26 సంవత్సరానికి 38.30 లక్షల పనిదినాల గుర్తింపు
వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
‘ఆత్మీయ భరోసా పథకం’
నేపథ్యంలో పెరగనున్న డిమాండ్
గతేడాది కంటే ఈసారి 12 వేల మేర తగ్గిన పనిదినాలు
2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనులకు ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వందశాతం పూర్తి చేస్తాం. ఆత్మీయ భరోసా పథకంతో ఉపాధి కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంత మేర పెరుగుతుందనేది మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. – చిన్న ఓబులేసు, డీఆర్‌డీఓ
ఉపాధి ప్రణాళిక ఖరారు
Comments
Please login to add a commentAdd a comment