చదువుతోపాటు క్రీడలపై శ్రద్ధ పెట్టాలి
ఉప్పునుంతల: బాలబాలికలు చదువుతోపాటు క్రీడలపై కూడా శ్రద్ధ పెట్టాలని డీవైఎస్‌ఓ సీతారాం అన్నారు. శనివారం మండలంలోని వెల్టూరు జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా మైదానంలో 34వ సబ్ జూనియర్ బాల బాలికల (కబడ్డీ) జిల్లాస్థాయి ఎంపిక ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 85 మంది బాలురు, 52 మంది బాలికలు పాల్గొన్నారు. ఎంపిక అయిన బాలబాలికలకు ఈ నెల 19 వరకు ఇక్కడే శిక్షణ ఇచ్చి.. ఈ నెల 20న వికారాబాద్‌లో జరిగే 34వ తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని సెలక్షన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సభ్యులు డాక్య, వినయ్‌కుమార్‌గౌడ్, భారతి, నిర్మల, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment